సోషల్ మీడియాలోకి వెళ్లడం అంటే బట్టలిప్పి రోడ్డు మీదకు రావడం లాంటిది
on Apr 30, 2025
బుల్లితెర మీద బులెట్ భాస్కర్ అంటే తెలియని వారు లేరు. ఆయన జబర్దస్త్ లో వేసే పంచులు మాములుగా ఉండవు. అలాగే టాలెంట్ ఉన్న వాళ్ళను కూడా జబర్దస్త్ లోకి తీసుకొచ్చాడు. అలాంటి బులెట్ భాస్కర్ ఒక ఇంటర్వ్యూలో చాల విషయాలు చెప్పాడు. "సోషల్ మీడియాకి ఎందుకు దూరంగా ఉంటున్నావు..యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ అసలు ఎందుకు కనిపించవు " అన్న ప్రశ్నకు "సోషల్ మీడియాలోకి వెళ్లడం అంటే బట్టలిప్పి రోడ్డు మీదకు రావడం లాంటిది.
నిజం చెప్పాలంటే బట్టలు ఎక్కడ మార్చుకోవాలి బెడ్ రూమ్ లో అదే బయట మార్చుకుంటే ప్రతీ ఒక్కరూ అడుగుతారు. అలా బయటకు రావడం ఎందుకు వేరే వాళ్లతో అనిపించుకోవడం ఎందుకు. ఉదాహరణకు ఎవరో ఒక అతను యూట్యూబ్ లో వీడియో చేస్తూ ఈ రోజు మా ఆవిడ ఎం చేసిందో తెలుసా అంటాడు ఇంతలో కింద ఒకడు కామెంట్ పెడతాడు ఏమని అంటే... మీ ఆవిడ నడుం మీద పుట్టు మచ్చ బాగుంది అని కామెంట్ చేస్తాడు. అలాంటి కామెంట్స్ అవసరమా..అందరూ పోజిటివ్ గానే పెట్టరు కదా కామెంట్స్. ఏ విషయాన్ని ఐనా కూడా నేను భరించగలను కానీ ఒకళ్ళతో అనిపించుకోవడం ఒకరితో చెప్పించుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకు వాళ్ళతో మాటలు అనిపించుకోవడం.. తినడానికి, ఉండడానికి ఉంటే చాలు. అందరూ అంటారు యు ట్యూబ్ ఛానెల్ పెట్టుకోండి అని కానీ వద్దు బాబోయ్ అంటూ ఉంటాను నేను. జబర్దస్త్ లో మా నాన్నకు నాకంటే ఎక్కువ ఫాలోయింగ్ వచ్చింది. కార్యక్రమాల కోసం విదేశాలు వెళ్లినా కూడా మా నాన్ననే అడుగుతారు. మా నాన్న బయట ఎలా మాట్లాడతాడో స్టేజి మీద కూడా అలాగే మాట్లాడతాడు. దేవుడి దయ వలన నేను కష్టపడి పని చేసి వాళ్ళను చూసుకుంటున్నాను. నేను బయటకు వచ్చి ఫ్రెండ్స్ తో వెళ్లి ఎంజాయ్ చేయడం వంటివి ఏమీ చేయను. ఇంట్లో సరుకులు ఇపోయాయ వెళ్లి తేవడం పిల్లలకు ఎం కావాలో చేయడం ఇంటిని చక్కబెట్టుకోవడం ఇదే లైఫ్. ఐతే ఈవెంట్స్ చేసుకుంటా లేదంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తా. " అని చెప్పాడు బులెట్ భాస్కర్ .

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
